Attack on YSRCP leader: కడప జిల్లా మైదుకూరుకు చెందిన శశిధర్‌రెడ్డి వైకాపాలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన ప్రొద్దుటూరులోని ఓ ఆయిల్ మిల్లును నిర్వహిస్తున్నారు. ఓ విందు కార్యక్రమం ఉండటంతో ఆదివారం రాత్రి గ్రామీణ ఠాణాపరిధిలోని ఓ రిసార్ట్‌కు వెళ్లారు. పార్టీ ముగించుకుని తిరిగి వెళ్తుండగా కొందరు వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి తనపై దాడి చేసేందుకు వెంబడించారని తెలిపారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బైకు పైనుంచి కింద పడటంతో అతని ముఖంపై గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఘటనపై గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Visakha Steel: ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు: కార్మిక సంఘాలు
Attack on YSRCP Leader: మైదుకూరులో వైకాపా నాయకుడిపై దాడికి యత్నం - కడప జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Attack on YSRCP leader: ప్రొద్దుటూరులో మైదుకూరు వైకాపా నాయకుడిపై కొందరు దుండగులు దాడికి యత్నించారు. కళ్లలో కారం కొట్టి తనపై దాడి చేసేందుకు యత్నించారని అరోపించారు. అసలేం జరిగిందంటే..?