రానున్న రోజుల్లో కడప నగరానికి మహర్దశ రానుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. మంగళవారం అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబుతో కలిసి నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విన్నవించారు. నగర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన ప్రత్యేక నిధులను కేటాయించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.
ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు. ఈ విషయం నగర ప్రజలకు శుభ పరిణామం అన్నారు. రాబోయే రోజుల్లో కడపను రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. నగర అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: