భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) నిబంధనల ప్రకారం వాడిన పీపీఈ కిట్లను ప్రత్యేక జాగ్రత్తలతో పడేయాలి. అయితే కడపలో మాత్రం పీపీఈ కిట్లను నిర్లక్ష్యంగా రోడ్డు పక్కనే పడేశారు ఓ ఆసుపత్రి సిబ్బంది.
కడప జిల్లా కోర్టు ఎదుట ఉన్న శక్తి ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో రోడ్డు పక్కన పీపీఈ కిట్లు దర్శనమిచ్చాయి. కుక్కలు వాటిని వాసన చూస్తూ రోడ్డు మీదకు తీసుకెళ్లాయి. వాహనదారులు వాటిని అలాగే తొక్కుకుంటూ వెళ్లారు. ఈటీవీ భారత్ ఈ దృశ్యాలను కెమెరాలో బంధిస్తుండగా.. ఆసుపత్రి సిబ్బంది వచ్చి పీపీఈ కిట్లకు నిప్పు పెట్టారు. అది కూడా నిర్లక్ష్యంగా విద్యుత్ నియంత్రిక పక్కనే వీటిని తగులబెట్టారు.
ఇదీ చదవండి