కడప జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి శివశంకర్ ట్రాక్టరు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య కొంత కాలం క్రితం మరణించింది. దీంతో భర్త నుంచి ఎనిమిదేళ్ల కిందట విడిపోయిన షమీనా అనే మహిళను ఎనిమిది నెలల కిందట వివాహం చేసుకున్నాడు. షమీనాది పోరుమామిళ్ల మండలం పులివీడు. అయితే షమీనాకు శివశంకర్‌తో పెళ్లికి ముందే.. ఏడేళ్ల కుమార్తె ఉంది. ఆ పాప పులివీడులోని మేనమామ ఇంట్లో ఉంటోంది. దసరా సెలవులు కావడంతో నాలుగు రోజుల కిందట బాలికను శివశంర్, షమీనాలు శెట్టివీడుకు తీసుకొచ్చారు. కానీ తండ్రి స్థానంలో ఉన్న ఆ కసాయి కొండపై నుంచి షమీనా కుమార్తెను తోసి చంపే ప్రయత్నం చేశాడు.
అసలేం జరిగింది...?
మిట్టమానుపల్లె సమీప కొండ వద్ద మంగళవారం ఏడుపులు వినిపించాయి. అటు వెళ్తున్న వారు, గొర్రెల కాపరులు వెళ్లి చూస్తే కొండపై రాళ్ల మధ్య చిక్కుకుపోయిన బాలిక కన్పించింది. ఆమెను రక్షించి వివరాలు అడిగారు. మారు తండ్రి అయిన శివశంకర్ ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి కొండపై నుంచి తోసినట్లుగా బాలిక చెప్పింది. బాలిక చెప్పిన వివరాల మేరకు తల్లికి, వారి బంధువులకు సమాచారం అందించారు. ప్రథమ చికిత్స అనంతరం బాలికను కడప రిమ్స్‌కు తరలించారు.
శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై రఫీ తెలిపారు.
ఇదీ చదవండి :