ETV Bharat / city

COMPLAINT: 'అయ్యన్నపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలి' - వైకాపా నేతలు ఫిర్యాదు

తెదేపా నేత అయ్యన్నపాత్రుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైకాపా నేతలు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్సీ,ఎస్టీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

COMPLAINT
COMPLAINT
author img

By

Published : Sep 18, 2021, 8:23 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయాలని వైకాపా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. అయ్యన్నపై గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీకి వైకాపా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.

కోడెల వర్ధంతి సభలో అయ్యన్న చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నాయని అన్నారు. హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలు దళితులను కించపరిచటమేనని వారు అభిప్రాయపడ్డారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను రెచ్చగొట్టేలా తెదేపా నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవనున్న తెదేపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.