Conflict between Women for Land: గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడులో స్థల వివాదం ఇరు కుటుంబాల మహిళల వివాదానికి దారి తీసింది. బహిరంగంగా కొట్టుకునేలా చేసింది. వాలంటీర్‌గా విధులు నిర్వహించే అరుణ కుటుంబానికి.. అదే గ్రామానికి చెందిన మరో కుటుంబానికి గత కొంత కాలంగా స్థల వివాదం నడుస్తోంది. సోమవారం ఉదయం మహిళల మధ్య వివాదం జరగడంతో బాహాటంగా రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు మండల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
ఇదీ చదవండి : ఆడుకుంటూ అడవిలోకి చిన్నారి.. 36 గంటల తర్వాత తల్లిదండ్రుల చెంతకు