ETV Bharat / city

గుంటూరు కలెక్టర్​గా వివేక్ యాదవ్.. నేడు బాధ్యతల స్వీకరణ - ias vivek yadav latest news

గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్​గా వివేక్ యాదవ్ ఇవాళ బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

vivek yadav
guntur district collector vivek yadav
author img

By

Published : Feb 4, 2021, 4:03 AM IST

Updated : Feb 4, 2021, 4:33 AM IST

గుంటూరు కలెక్టర్​గా వివేక్ యాదవ్​ను ప్రభుత్వం నియమించింది. నేడు ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపిన ప్యానల్ నుంచి వివేక్ యాదవ్​ను నియమించాలని చేసిన సూచనల మేరకు వివేక్ యాదవ్​ను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీచేశారు.

ఉత్తరప్రదేశ్​కు చెందిన వివేక్ యాదవ్ 2008 ఐఏఎస్ బ్యాచుకు చెందినవారు. ఇప్పటివరకు కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగా పనిచేస్తూ బదిలీపై గుంటూరు జిల్లాకు రానున్నారు. 2013-2014 మధ్య వివేక్ యాదవ్ గుంటూరు జాయింట్ కలెక్టర్ గానూ పని చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఉప కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించారు. తర్వాత వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా, తర్వాత గుంటూరు, శ్రీకాకుళం జేసీగా, విజయనగరంలో కలెక్టర్ గా బాధ్యతలు నిర్వరిస్తూ.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. కలెక్టర్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు మోస్తున్న దినేశ్ కుమార్ నుంచి వివేక్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇదీ చదవండి

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Last Updated : Feb 4, 2021, 4:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.