ETV Bharat / city

CHAVITHI CELEBRATIONS: పండుగపై కరోనా ప్రభావం.. దయనీయంగా వ్యాపారుల జీవనం - vinayaka idols making merchants problems with vinayaka chavithi festival

రాష్ట్రంలో వినాయక చవితి సందడి కనిపించడం లేదు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి, పెట్టుబడులు పెట్టి, నిండా మునిగామని విగ్రహాల తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాలు కొనేవారు లేకపోవటంతో కొందరు వ్యాపారులు.. విగ్రహాలను హైదరాబాద్​కు తరలిస్తున్నారు. కనీసం చేతి ఖర్చులైనా మిగులుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దయనీయంగా మారిన వ్యాపారుల జీవనం
దయనీయంగా మారిన వ్యాపారుల జీవనందయనీయంగా మారిన వ్యాపారుల జీవనం
author img

By

Published : Sep 8, 2021, 8:45 PM IST

విఘ్నాలు తొలగించే వినాయకుడి పండగకు కరోనా రూపంలో ఆటంకాలు రావటంతో వ్యాపారులు, ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. గతేడాది కరోనా కారణంగా పండుగ జరపుకోకపోవడంతో విగ్రహాలన్నీ మిగిలిపోయాయి. ఈసారి కరోనా కేసులు తగ్గి పరిస్థితులు కొంత సానుకూలంగా ఉన్నా.. ప్రజల్లో భయాందోళన నెలకొంది. దీంతో పండుగకు ఆరు నెలల ముందు నుంచే విగ్రహాలను తయారు చేసిన వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది.

విగ్రహాల తయారీ కోసం ఒక్కొక్కరూ రూ.10లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు చేశారు. కరోనా కారణంగా పెద్ద విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ పరిణామాల నడుమ కొందరు వ్యాపారులు విగ్రహాలను హైదరాబాద్ తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఇక్కడే ఉంటే విగ్రహాలు వృథాగా ఉంటాయని, పక్క రాష్ట్రంలో విక్రయిస్తే.. కనీసం చేతి ఖర్చులకైనా వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఇదీచదవండి.

లోకేశ్‌ నరసరావుపేట పర్యటనకు అనుమతి లేదు: ఎస్పీ విశాల్ గున్నీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.