మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గుంటూరులో ఓ పార్టీ నేతలు కుక్కర్లను పంపిణీ చేస్తున్నట్లు అరండల్ పేట సీఐ నరేష్ కుమార్ తెలిపారు. గుంటూరులో అన్నదాన సత్రం, రజకుల బజార్, రామాలయం వద్ద 18 రైస్ కుక్కర్లు పంపిణీ చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
ఇదీ చూడండి: నెల్లూరు నగర పాలక, మరో మూడు పురపాలికల సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు