గుంటూరు జిల్లాలో ప్రైవేటు కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు బస్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 41 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. పండగ వేళ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న అభియోగంపై రెండు బస్సులకు రూ. 25వేల చొప్పున జరిమానా విధించిన అధికారులు కేసులు నమోదు చేశారు.
ప్రయాణికుల జాబితా లేని 6 బస్సులు, ఒకే డ్రైవర్‌తో నడుపుతున్న 6 బస్సులను గుర్తించి కేసులు నమోదు చేశారు. పండగ వేళ ప్రయాణికులను ఇబ్బందులు పెట్టేలా బస్సు యాజమాన్యాలు వ్యవహరించరాదని.. ఈ దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దొంగగా మారిన కానిస్టేబుల్... ఉన్నతాధికారి ఇంటికే కన్నం !