ETV Bharat / city

ఏటికేడు తగ్గుతున్న పొగాకు ఎగుమతులు.. కారణాలేంటి?

ఏటికేడు తగ్గుతున్న సాగు విస్తీర్ణం.. అదేస్థాయిలో పడిపోతున్న ఎగుమతులు.. కానీ కళ్లముందు మాత్రం భారీ లక్ష్యాలు. ఎలాగోలా ఎగుమతి చేద్దామంటే కనీస ప్రోత్సాహకాలు కరవు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో పొగాకు వ్యాపారుల్ని వేధిస్తున్న సమస్య. ఒకప్పుడు అంతర్జాతీయ ఎగుమతుల్లో తనదైన ముద్ర వేసిన పొగాకు. గత ఆరేళ్లుగా కేంద్రం నుంచి సరైన సహకారం లేక తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. భారీగా విదేశీ మారక ద్రవ్యం వస్తున్నా పొగాకు ఎగుమతుల్ని ప్రోత్సహించటం లేదనేది వ్యాపార వర్గాల వాదన.

author img

By

Published : Oct 27, 2021, 7:20 PM IST

గుంటూరు రైతులకు పొగాకు సమస్య తీరట్లే...
గుంటూరు రైతులకు పొగాకు సమస్య తీరట్లే...

"గుంటూరు పొగాకు గూట్లో ఉన్నా.. నోట్లో ఉన్నా ఒకటే" అనేది నానుడి. గుంటూరు మిర్చికే కాదు.. ఇక్కడ పండే పొగాకుకూ అంత ఘాటు ఉంటుంది మరి. దీనికి తగ్గట్లుగానే పొగాకు సాగులో రాష్ట్రంలోనే గుంటూరు అగ్రస్థానంలో ఉంటుంది. ఇక్కడి నేలల్లో పండే పొగాకులో నికోటిన్ శాతం ఎక్కువగా ఉందనే కారణంగా జిల్లాలో సాగు తగ్గించారు. అయినా.. గుంటూరు కేంద్రంగానే పొగాకు వ్యాపారం సాగుతోంది.

రాష్ట్రంలో పండించే పొగాకులో 70 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే.. కొన్నేళ్లుగా ఎగుమతిదారులు సరైన ప్రోత్సాహకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. 2014 వరకూ పొగాకు ఎగుమతులపై కేంద్రం 3 నుంచి 5శాతం మేర రాయితీల్ని అందించేది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేశారు. ఆర్​ఓడీటీఈపీ(R.O.D.T.E.P.) పేరిట వ్యవసాయ ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నా.. అందులో నుంచి పొగాకును మినహాయించారు. ఇది వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. పొగాకు బోర్డు మాత్రం 30శాతం ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా నిర్దేశించడంపై వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.

విదేశాల్లో మాదిరిగా పొగాకుకు ప్రోత్సాహకాలు అందించాలని వ్యాపారులు కోరుతున్నారు. వ్యాపారులు తయారుచేసే మద్యం ఎగుమతులకు కూడా రాయితీలు ఇచ్చే ప్రభుత్వం.. రైతులు పండించే పొగాకుకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. బోర్డు అధికారులు మాత్రం వ్యాపార వర్గాల ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని చెబుతున్నారు. రైతులు సైతం ఉత్తమ పద్ధతులు అనుసరించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని తెలిపారు.

పొగాకు ఎగుమతుల విషయంలో నాణ్యత కూడా ఓ సమస్యగా మారుతోంది. రసాయనాలు, పురుగు మందులు ఎక్కువగా వినియోగించటం, సరిగ్గా శుభ్రపరచకపోవటం కూడా ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. వీటిపై పొగాకు బోర్డు ఇటీవలి కాలంలో దృష్టి సారించింది. ఆర్గానిక్ విధానంలో సాగు రైతుల్లో అవగాహన కల్పిస్తోంది.

ఇదీ చదవండి: Govt. Medical College : ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.