ETV Bharat / city

ముగ్గురు సభ్యుల క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

ముగ్గురు సభ్యుల క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12.06 లక్షల రూపాయలు, కారు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
author img

By

Published : Apr 25, 2021, 5:17 PM IST

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి

గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు సభ్యుల క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు పోట్ల శ్రీనివాసరావు, అతని స్నేహితుడు సూర్యతేజ, కలెక్షన్ ఏజెంట్ షేక్ నాగూల్ మీరాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12.06 లక్షల రూపాయలు, కారు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. ఇదే కేసులో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడికి కలెక్షన్ ఏజెంట్ నాగూల్ మీరా బురిడీ కొట్టించే యత్నం చేశారు. పోలీసులు వచ్చి దాడి చేసి డబ్బుల ఎత్తుకెళ్లారంటూ డబ్బు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించగా.. నాగూర్ మీరాపై నిర్వాహకుడు శ్రీనివాసరావు దాడి చేశారని.. బెట్టింగ్ నిర్వాహకుడిపై అపహరణ, హత్యాయత్నం కేసు నమోదు చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.

ఇదీ చదవండీ... కొవిడ్ బాధితుల సమస్యలకు 4 గంటల్లోనే పరిష్కారం: మంత్రి వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.