కరోనా కారణంగా గుంటూరులోని హోల్ సేల్ కూరగాయల మార్కెట్ మూతపడింది. ఇక్కడి వ్యాపారులకు కరోనా సోకడమే దీనికి కారణం. మార్కెట్లోని వ్యాపారులు, వారి కుటుంబసభ్యులు మొత్తం కలిపి పాతిక మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ఫలితంగా.. ఇతర వ్యాపారుల్లో ఆందోళన పెరిగింది.
కోయంబేడు లింకులే ఇక్కడ వైరస్ వ్యాప్తికి కారణమని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ మూతపడిన కారణంగా.. జిల్లాలో కూరగాయల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రజలకు కొరత రాకుండా... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు.
ఇవీ చదవండి: