TENSION AT ANNA CANTEEN : గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్‌ను పోలీసులు, అధికారులు తొలగించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆగస్ట్ 12న స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద తెదేపా నేతలు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి.. రోజూ వెయ్యి మంది నిరుపేదలకు ఆహారం అందిస్తున్నారు. నాలుగురోజులుగా ఇదే ప్రాంతంలో వైకాపా నేతలు కూడా అన్నదానం నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని.. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని మున్సిపల్ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు.
ఇవాళ తెల్లవారుజామునే వందల మంది పోలీసులు మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని సమీపంలో ఉన్న దుకాణాల్ని మూసి వేయించారు. అన్నా క్యాంటీన్ ఆహార పదార్ధాల ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెదేపా కార్యకర్తలు ఆటోలోని కొన్ని ఆహార పదార్థాలతో మార్కెట్ సమీపంలోని పురవేదిక వద్ద ఆహార పంపిణీ చేపట్టారు. మున్సిపల్ అధికారులు పంపిణీ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తెదేపా శ్రేణులు నిరసనకు దిగాయి.
పేదల కడుపు కొట్టొద్దని అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. దాంతో మున్సిపల్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో వైకాపా వారు మున్సిపల్ మార్కెట్ వద్ద అన్నదానానికి యత్నించారు.. అధికార పార్టీ వారికి మాత్రం ఎలా అనుమతిస్తారని పోలీసుల్ని తెదేపా నేతలు నిలదీశారు. మార్కెట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
తెదేపా శ్రేణులు పురవేదిక వద్ద చేస్తున్న ఆహార పంపిణీని పోలీసులు అడ్డుకున్నారు. ఆహార పదార్ధాల్ని లాగి పక్కన పెట్టేశారు. తెదేపా కార్యకర్తల్ని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. పేదల ఆకలి తీర్చే కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని తెదేపా నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇనుప కంచెలతో పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.
పోలీసుల చేతిలో గాయపడిన వారిని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పరామర్శించారు. పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం, అధికారులు ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా.. అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదల ఆకలి తీరుస్తామని తెదేపా నాయకులు తేల్చిచెప్పారు. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆహారం అందిస్తామని స్పష్టం చేశారు.
అన్న క్యాంటీన్ తొలగింపుపై లోకేశ్ ఆగ్రహం: అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుపడ్డారని, ఇప్పుడు తెనాలిలోనూ అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతుండటంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్ కాంప్లెక్స్ వద్ద పోలీస్ పహారా పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతామని ఆయన అన్నారు.
-
తెనాలి లో అన్న క్యాంటీన్ కి అడ్డుపడటం మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతాం. పేద వాళ్ళ ఆకలి తీరుస్తాం.(2/2)
— Lokesh Nara (@naralokesh) September 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
#AnnaCanteens #AnnamPettiCheppandi
">తెనాలి లో అన్న క్యాంటీన్ కి అడ్డుపడటం మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతాం. పేద వాళ్ళ ఆకలి తీరుస్తాం.(2/2)
— Lokesh Nara (@naralokesh) September 3, 2022
#AnnaCanteens #AnnamPettiCheppandiతెనాలి లో అన్న క్యాంటీన్ కి అడ్డుపడటం మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతాం. పేద వాళ్ళ ఆకలి తీరుస్తాం.(2/2)
— Lokesh Nara (@naralokesh) September 3, 2022
#AnnaCanteens #AnnamPettiCheppandi
ఘర్షణలో తెదేపా కార్యకర్తలకు గాయాలు : తెనాలిలో అన్న క్యాంటీన్ వద్ద ఘర్షణలో తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు తోసేయడంతో కొందరు కార్యకర్తలకు గాయాలు కాగా.. శ్రీనివాస్ అనే కార్యకర్తకు కాలు విరిగింది. దాంతో ఆ వ్యక్తిని తెనాలి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తెదేపా కార్యకర్తలను నక్కా ఆనంద్‌బాబు పరామర్శించారు.
ఇవీ చదవండి: