అమరావతిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరిగింది. ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ చేయనున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో కొత్త కమిటీల ఏర్పాటుకు చేయాల్సిన కసరత్తుపై సమాలోచనలు జరుపుతారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా నేతలతో ఆయన మంతనాలు జరుపుతారు. ఈ సమావేశానికి తెలంగాణ నేతలూ హాజరయ్యారు. పొలిట్‌బ్యూరో సమావేశానికి హాజరైన నేతలను, అధినేత చంద్రబాబును... గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ తరహా ఆహ్వాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పొలిట్‌బ్యూరోలో చర్చలు... ప్రక్షాళణ దిశగా నిర్ణయాలు...!
ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు చర్చిస్తున్నారు నేతలు. ఈ భేటీకి తెలంగాణ నేతలూ హాజరయ్యారు.
అమరావతిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరిగింది. ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ చేయనున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో కొత్త కమిటీల ఏర్పాటుకు చేయాల్సిన కసరత్తుపై సమాలోచనలు జరుపుతారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా నేతలతో ఆయన మంతనాలు జరుపుతారు. ఈ సమావేశానికి తెలంగాణ నేతలూ హాజరయ్యారు. పొలిట్‌బ్యూరో సమావేశానికి హాజరైన నేతలను, అధినేత చంద్రబాబును... గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ తరహా ఆహ్వాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రిపోర్టర్: ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్93944 50286
AP_TPG_11_09_CURRENCY_KANAKADURGA_AV_AP10092
( ) శ్రావణమాస శుక్రవారం వరలక్ష్మి వ్రత పర్వదినాన పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి లోని కనకదుర్గ అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో దర్శనం ఇస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఆరున్నర లక్షల రూపాయల కరెన్సీ తో ఆలయాన్ని అమ్మవారిని ధన లక్ష్మి దేవి గా తీర్చిదిద్దారు.
Body:ఆలయ ముఖ మండపంలో కరెన్సీ నోట్లతో తోరణాలు ఏర్పాటుచేయగా అమ్మవారి ద్వారపాలకులను సైతం నోట్లతో అలంకరించారు. అమ్మవారిని ఆపాదమస్తకం నోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖమండపం గోడలను సైతం కరెన్సీ నోట్లతో తాపడం చేసినట్లుగా అలంకరించి వన్నె తెచ్చారు.
Conclusion:ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజు దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులుతీరి నిలిచి అమ్మవారిని దర్శించుకున్నారు.