గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు వద్ద అమరావతి పోలీసులు పెద్దఎత్తున అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. వాటర్ ట్యాంకర్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న 9,100 బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో కాపు కాసి పోలీసులు మద్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ. 21లక్షలు ఉంటుందని ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.
ఇదీ చూడండి