రాష్ట్రంలోకి అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరు లాలాపేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 770 మద్యం సీసాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ 65 వేల రూపాయలు ఉంటుందని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మద్యం అక్రమ రవాణా చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి