వైకాపా అరాచకాలపై డాక్యుమెంటరీ తయారు చేశామని...దానిని రేపు విడుదల చేస్తామని తెలుగుదేశం నేతలు తెలిపారు. ఐదేళ్ళ తరువాత వైకాపా నేతలకు బాధితులు ఇప్పుడు గుర్తొచ్చారా అని వారు నిలదీశారు. అనైతిక చర్యలకు పాల్పడుతున్న హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పల్నాడుపై ఐజీ, ఎస్పీల ప్రకటనలు సిగ్గు చేటని వారు అన్నారు. ఛలో ఆత్మకూరుకు పోలీసుల అనుమతి అవసరం లేదన్న నేతలు... బాధితులకు భరోసా కల్పిస్తే చాలని స్పష్టం చేశారు. 11న ఛలో ఆత్మకూరుకు సిద్దమైనట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి-దాడులు అరికట్టండి..కిషన్‌రెడ్డికి తెదేపా నేతల విజ్ఞప్తి