ETV Bharat / city

సీఎం జగన్​కు తెదేపా ఎమ్మెల్యే అనగాని లేఖ - మైనార్టీల కోసం సీఎంకు లేఖ

రాష్ట్రంలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందడం లేదని తెదేపా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్​ లేఖ రాశారు. వైకాపా పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.

tdp mla anagani
తెదేపా ఎమ్మెల్యే అనగాని
author img

By

Published : Jun 21, 2022, 10:49 AM IST

సీఎం జగన్​కు తెదేపా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్​ బహిరంగ లేఖ రాశారు. మైనార్టీల అభివృద్ధి కోసం తెదేపా హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఆపేయడం దారణమని మండిపడ్డారు. వైకాపా పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. తక్షణమే ఆ పథకాలను పునరుద్ధరించి మైనారిటీలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ చర్యలతో మైనారిటీలు మరింత పేదరికంలోకి వెళ్లిపోయారన్నారన్న అనగాని.. వైకాపా పాలనతో వారికి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. తెదేపా హయాంలో ఇచ్చిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలకు మంగళం పాడారని దుయ్యబట్టారు. మూడేళ్లుగా యువతకు ఉపాధి కరువైందని.. ఉన్నత విద్య, విదేశీ విద్య నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు చేపట్టారన్నారు. జగన్‌ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయని ధ్వజమెత్తారు. ముస్లిం ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు.

TDP MLA Letter
ఎమ్మెల్యే అనగాని లేఖ
TDP MLA Letter
ఎమ్మెల్యే అనగాని లేఖ

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.