ETV Bharat / city

'వైకాపా ఆగడాలకు అంతే లేకుండాపోయింది' - kalva

గుంటూరులో ఏర్పాటు చేసిన వైకాపా ప్రభుత్వ బాధితుల పునరావాస కేంద్రాలను సందర్శించిన తెదేపా నేతలు సీఎం జగన్​పై మండిపడ్డారు. అతనిది తుగ్లక్ పాలన అనీ.. పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

'వైకాపా ప్రభుత్వ ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది'
author img

By

Published : Sep 9, 2019, 5:02 PM IST

'వైకాపా ప్రభుత్వ ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది'

జగన్​కి అధికారం శాశ్వతం అని పోలీసులు భావిస్తే.. తెదేపా కార్యకర్తలకు రక్షణ కల్పించలేమని లిఖితపూర్వకంగా రాసివ్వాలని ఆ పార్టీ నేతలు అన్నారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజా, ఎమ్మెల్సీలు అశోక్​బాబు, రాజేంద్రప్రసాద్‌లు పునరావాస కేంద్రాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ ఆగడాలకు అఖిల భారత సర్వీస్ అధికారులు అడ్డుకట్ట వేయకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికే ఈ నెల 11న 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.

జగన్​ పరిపాలనకు, తుగ్లక్​ పరిపాలనకు దగ్గరి పోలికలు ఉన్నాయని తెదేపా అధికార ప్రతినిధి, పంచుమర్తి అనురాధ విమర్శించారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి తర్వాత నాణ్యమైనవి అని మాట మార్చి.. చెక్క బియ్యం పంపిణీ చేశారని ఎద్దేవా చేశారు. 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నకాంటీన్లు మూసేయడం తుగ్లక్ పరిపాలన కాదా అని ప్రశ్నించారు.

రాజధానిగా అమరావతిని ఉంచుతున్నారో.. మారుస్తున్నారో జగన్ సమాధానం చెప్పాలనీ.. మారిస్తే ఎక్కడికో చెప్పాలని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్‌ చేశారు. అమరావతినే కొనసాగిస్తుంటే పనులు ఎప్పుడు పునరుద్దరిస్తారని ప్రశ్నించారు. రాజధాని గురించి కనీస అవగాహన లేని బొత్స మంత్రిగా అనర్హుడన్నారు. 2లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బొత్స దానిని నిరూపించాలనీ.. లేదంటే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

పథకాలు సంతృప్తికర స్థాయిలో అందించడానికే విధానాలు'

Intro:Body:

dummy

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.