విద్యారంగానికి కొవిడ్ సరికొత్త పాఠాలు నేర్పిందంటున్నారు విద్యారంగ నిపుణులు వి.సాంబశివరావు. సాంకేతిక విద్యారంగంలో అపార అనుభవం గడించిన ఆయన.. బిట్స్, ఎన్.ఐ.ఐ.టి వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేసి ప్రస్తుతం అమరావతిలోని ఎస్.ఆర్.ఎం విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నారు. మన దేశంలో ఉన్న సాంకేతిక వనరులు... కరోనా నుంచి విద్యావ్యవస్థను త్వరగా కోలుకునేలా చేశాయని ఈటీవి భారత్ ముఖాముఖిలో తెలిపారు. త్వరలో విద్యా సంస్థలు ప్రారంభం కానున్న తరుణంలో కరోనా రహిత క్యాంపస్ లు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
సంక్షోభాలు వచ్చిన సమయంలో ఉద్యోగాలు కోల్పోకుండా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు మెళకువలు నేర్పించాల్సిన అవసరం ఉందని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం దేశానికి సరికొత్త మార్గాన్ని చూపబోతుందన్నారు. నూతన విద్యా విధానం పరిశోధనకు పెద్దపీట వేస్తూ... మాతృభాషను అందలం ఎక్కిస్తూ... నచ్చిన అంశాలన్ని నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తూ... భారీ సంస్కరణలకు నాంది పలకబోతోందంటున్న సాంబశివరావుతో ముఖాముఖి.
ఇదీ చదవండి:
'హోదా రానంతవరకు రాష్ట్ర విభజన ప్రక్రియ అసంతృప్తిగానే ఉంటుంది'