అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది. భాజపా నాయకుడు, కేంద్ర కార్మిక శాఖ సంక్షేమ బోర్టు ఛైర్మన్ వల్లూరు జయప్రకాష్ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు తోచిన రీతిలో విరాళాలు ఇచ్చారు. అంతకుముందు నగరంలో ర్యాలీ నిర్వహించారు. మందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని జయప్రకాష్ కోరారు.
ఆనంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ... ఆలయాలను కాపాడాలంటూ రాష్ట్రంలో హిందువులు రోడ్డెక్కె పరిస్థితి రావటం బాధాకరమన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలు దారుణమని విమర్శించారు. వెంటనే ఆలయాలపై దాడులు చేస్తున్న దోషులను శిక్షించాలని శ్రీనివాసానంద కోరారు. రానున్న రోజుల్లో రథయాత్ర చేసి హిందువులందరినీ సంఘటితం చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి
కేంద్రానికి భాజపా నేతలు ఫిర్యాదు చేసుకోవచ్చు: మంత్రి వెల్లంపల్లి