ETV Bharat / city

రైళ్లలో వ్యర్థాల నిల్వ సమస్యకు.. నూతన సాంకేతికతతో చెక్ - రైళ్లలో దుర్వాసన నివారణకు నూతన ఆవిష్కరణ

రైళ్లలోని మరుగుదొడ్లలో వ్యర్థాల ద్వారా వచ్చే సమస్యలకు పరిష్కారం చూపారు గుంటూరు జిల్లాకు చెందిన ఇంజినీరింగ్‌ నిపుణులు కృష్ణయ్య. దుర్వాసన రాకుండా రైళ్లలో బయో టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చినా..సరైన నిర్వహణ లేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటికి పరిష్కారంగా కొత్తరకం పరిజ్ఞానాన్ని రూపొందించారు కృష్ణయ్య. కొత్త సాంకేతికతకు రైల్వేతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది.

రైళ్లలో వ్యర్థాల నిల్వ సమస్య
రైళ్లలో వ్యర్థాల నిల్వ సమస్య
author img

By

Published : Aug 4, 2021, 8:18 AM IST

రైలు ప్రయాణంలో వచ్చే సమస్యల్లో ప్రధానమైనది మరుగుదొడ్ల నుంచి వచ్చే దుర్వాసన. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బోగీల్లో బయో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా వీటిని వినియోగిస్తున్నా.. చెత్తా చెదారం వేస్తుండటంతో అవి టాయిలెట్‌ ట్యాంక్‌లో పోగవుతున్నాయి. మానవ వ్యర్థాలను మాత్రమే డీ కంపోజ్‌ చేసేలా బయోటాయిలెట్లను రూపొందించారు. కానీ అదనంగా వచ్చి చేరుతున్న చెత్తతో బయో టాయిలెట్లు పనికిరాకుండా పోయి వాటిని ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరటం లేదు. దీనికి పరిష్కారంగా ఆటోమేటెడ్‌ ట్రైన్‌ టాయిలెట్‌ సీవరేజ్‌ డిస్పోజల్‌ సిస్టంను అభివృద్ధి చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌వీ కృష్ణయ్య. సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ కొత్త విధానంలో టాయిలెట్‌ సీటు కింద సాధారణ ట్యాంక్‌ ఉంటుంది.

రైళ్లు ప్రయాణించే మార్గాల్లో మారుమూల ప్రాంతంలో ప్రతి 200 కిలోమీటర్లకు ఒకచోట పట్టాల కింద సెప్టిక్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేస్తారు. రైలు ఇంజిన్‌ ఈ సెప్టిక్‌ ట్యాంక్‌ వద్దకు రాగానే..దానిపై ఉన్న మూత దానంతట అదే తెరుచుకుంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌-ఆర్‌ఎఫ్‌ఐడీ పరిజ్ఞానంతో ఇది పనిచేస్తుంది. ఈ సాంకేతికతతో సెప్టింక్ ట్యాంకు వద్దకు రాగానే ప్రతి బోగిలోని టాయిలెట్ ట్యాంక్ తెరుచుకుని..అందులో పోగైన వ్యర్థాలు కింద ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడిపోతాయని చెబుతున్నారు కృష్ణయ్య.

బయోటాయిలెట్ల ఏర్పాటతో పోలిస్తే ఈ విధానాననికయ్యే ఖర్చు కూడా ఏడింతలు తగ్గుతుందని అంటున్నారు కృష్ణయ్య. ఈ ప్రాజెక్టుకు రైల్వేకు చెందిన ఆర్.డి.ఎస్.ఓ తో పాటు కేంద్రప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ ఆమోదించాయని చెబుతున్నారు. మొదటి దశకు ఆమోదం తెలిపిన రైల్వే... రెండో దశ పరిశోధనలు పూర్తి చేయాలని సూచించిందని.. రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి ఎంఎస్​ఎంఈ రూ. 15లక్షల ఆర్థిక తోడ్పాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పరిశోధన పూర్తైతే రైల్వే టాయిలెట్లకే కుండా కమ్యూనిటి టాయిలెట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మురుగు సమస్యలకు పరిష్కారం లభించనుందని కృష్ణయ్య చెబుతున్నారు. ప్రజలకు విస్తృతస్థాయిలో ఉపయోగపడే ప్రయోగాలు చేయటమే లక్ష్యమని.. నిధులు రాగానే రెండోదశ పరిశోధనలు పూర్తి చేస్తానని కృష్ణయ్య అంటున్నారు.

ఇదీ చదవండి:

GRMB MEETING: అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం: ఏపీ ఈఎన్​సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.