రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇప్పటికే తక్కువ రకాల మద్యం సరఫరా అవుతుందని మద్యం ప్రియులు వాపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరులోని బాపట్ల బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో గత రాత్రి కొందరు యువకులు మద్యం సీసాను కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి అట్టపెట్టె తెరిచి చూడగా మద్యం సీసాలో పాము పిల్ల ఉన్నట్టు గుర్తించారు. వెంటనే మద్యం షాప్ వద్దకు వెళ్లి దుకాణంలోని సిబ్బందిని నిలదీశారు. వేరే మద్య సీసా ఇవ్వడానికి నిరాకరించడంతో వారితో వాదనకు దిగారు. దీంతో చేసేదిలేక సిబ్బంది... మరో బాటిల్ ఇచ్చి వెనక్కి పంపించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇవీ చదవండి: