'డిగ్రీ కాలేజీ' సినిమాను అడ్డుకుంటాం: ఎస్ఎఫ్ఐ - degree college cinema latest news
అసభ్యకర సన్నివేశాలతో చిత్రీకరించిన 'డిగ్రీ కాలేజీ' సినిమాను అడ్డుకుంటామని గుంటూరులోని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. దేశ భవిష్యత్తుకు నిర్మాణమైన తరగతి గదులలో అశ్లీల సన్నివేశాలు చిత్రీకరించటం సరికాదన్నారు. సెన్సార్ బోర్డ్ సినిమాను మరోమారు పరిశీలించి అసభ్యకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తే ... థియేటర్ వద్ద ఆందోళనలు చేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ హెచ్చరించారు.
డిగ్రీ కాలేజీ సినిమాకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన
By
Published : Feb 7, 2020, 9:55 AM IST
.
మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్