ETV Bharat / city

నిర్మాణ రంగానికి కరోనా కాటు... ఇబ్బందుల్లో కార్మికులు, వ్యాపారులు! - భవన నిర్మాణ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం

కరోనా దెబ్బతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. భవన నిర్మాణ రంగం సైతం కొవిడ్ కష్టాలకు ఎదురీదుతోంది. వైరస్ భయంతో కొనుగోలుదారులు ముందుకు రాకపోవటానికితోడు...పెరిగిన ధరలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప తాము కోలుకోలేని పరిస్థితి నెలకొందని భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Covid effect on construction sector
నిర్మాణరంగంపై కొవిడ్ ప్రభావం
author img

By

Published : Jun 27, 2021, 5:24 PM IST

నిర్మాణ రంగానికి కరోనా దెబ్బ

కొవిడ్ కల్లోలానికి భవననిర్మాణ రంగం తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. గుంటూరు జిల్లాలో గతంలో కళకళలాడిన భవననిర్మాణ, స్థిరాస్తి రంగాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కొవిడ్ తొలి దశ కష్టాల నుంచి కోలుకుంటున్న క్రమంలో...రెండోవిడత వైరస్ వ్యాప్తి పరిణామాలు భవన నిర్మాణరంగం పురోగతికి అవరోధంగా మారాయి. ఇసుక లభ్యత పూర్తిస్థాయిలో లేకపోవటంతో కార్మికులు, వ్యాపారులు, బిల్డర్లకు కష్టాలు తప్పడం లేదు.

భవననిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, నిర్మాణ సామగ్రి ధరలు 30 నుంచి 40శాతం పెరిగాయని బిల్డర్లు చెబుతున్నారు. పెరిగిన ధరలు గృహనిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని...ఫలితంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి వెనుకడుగు వేసే పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోయారు..ఈ కష్టాలకుతోడు కొవిడ్ కారణంగా నిపుణులైన కూలీల కొరత పట్టిపీడిస్తోంది. లాక్‌డౌన్ పరిస్థితులతో ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నిర్మాణాలు వేగంగా ముందుకు సాగడం లేదని....సైట్‌ ఇన్‌ఛార్జిలు ఆవేదన చెందుతున్నారు.

కరోనా కారణంగా భవన నిర్మాణరంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ... ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహక చర్యలు చేపట్టి ఆదుకోవాలని కార్మికులు, వ్యాపారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు పూర్తైతే.. ఎడారిగా ఏపీ: కొల్లు రవీంద్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.