గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన వైద్య చికిత్స నిర్వహించారు. 3 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్న ప్రభావతి అనే మహిళకు ఒకేసారి రెండు మోకీళ్ళు మార్పిడి చేశారు. దేశంలోనే మొదటిసారి ఇలాంటి అరుదైన చికిత్స తమ హాస్పిటల్లో చేయడం జరిగిందని వైద్యులు వెల్లడించారు. పదేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న ప్రభావతి...ఎత్తు తక్కువగా ఉన్న కారణంగా వైద్యులు ఎవరూ మోకీళ్లు మార్పిడి చేసేందుకు ముందుకు రాలేదు. సాధారణంగా అందరికీ ఉపయోగించే పరికరాలు ప్రభావతికి సరిపోవని వైద్యులు తెలిపారు. త్రీడీ సిటీ స్కాన్ తీసి... ప్రత్యేకమైన కృత్రిమ మోకీళ్లు... తయారు చేయించినట్లు వైద్యులు వెల్లడించారు. వాటిని ఉపయోగించి మహిళకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసినట్లు వివరించారు.
ఇవీ చూడండి-తన చిట్టితల్లి కోసం... ఓ అమ్మ పడే ఆరాటం!