ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా గురు సన్మానాలు, గురు, ప్రతిభా పురస్కారాలను రామినేని ఫౌండేషన్ ప్రదానం చేస్తుంది. ఈ నెల 9న గుంటూరులోని సిద్ధార్ధ గార్డెన్స్‌లో 106 మందికి గురు పురస్కారాలు, 84 మందికి గురు సన్మానాలు నిర్వహించనుంది. అలాగే జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన 261 విద్యార్ధులకు ప్రతిభా పురస్కారం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ ధర్మ ప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాలను అధిరోహించారని.. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో తమ సంస్థ పని చేస్తుందని వారు చెప్పారు.
ఇదీ చదవండి :