ETV Bharat / city

CANNABIS : పైన దేవుడి ఫొటోలు పెట్టి.. లోపల ఏం తరలించారో తెలుసా? - east godavari district news

పవిత్రమైన భక్తుల్లా కలరింగ్ ఇచ్చారు.. దేవతా మూర్తుల చిత్రపటాలతో ప్రయాణం మొదలు పెట్టారు.. కాషాయం ఒక్కటి తక్కువైందిగానీ.. అది కూడా ధరిస్తే, దేశాటనకు బయలుదేరిన ఏ సాధుపుంగవులో అనుకోవడం తథ్యం! అన్ని దేవుళ్ల బొమ్మలు ఉన్నాయి మరి వారి చేతుల్లో! పైన దేవుడి ఫొటోలు పెట్టి.. లోపల సరుకు భద్రంగా దాచారు. ఇక, తీరం చేరినట్టే అనుకునే సమయంలో.. పోలీసులు ప్రవేశించారు.

MARIJUANA CAUGHT
MARIJUANA CAUGHT
author img

By

Published : Oct 7, 2021, 5:25 PM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నుంచి రాజమండ్రి వైపు ఓ ఆటో వస్తోంది. అందులో దాదాపు అరడజను దేవుళ్ల చిత్రపటాలతో కొందరు ప్రయాణిస్తున్నారు. చూడ్డానికి భక్త బృందం మాదిరిగా ఉన్నారు. అయితే.. కిర్లంపూడి మండలం బూరుగు పూడి గ్రామం వద్దకు రాగానే.. వాళ్ల అసలు రంగు బయట పడింది. అక్కడే తనిఖీలు చేస్తూ సిద్ధంగా ఉన్న పోలీసులు.. అనుమానం వచ్చి లాఠీ అడ్డుపెట్టారు. ఆటోలోని దేవుళ్ల పటాలను తొలగించి చూసి నిశ్చేష్ఠులయ్యారు. దేవుళ్ల ఫొటోల వెనుక ఎవ్వరూ ఊహించని విధంగా గంజాయి బయటపడింది.

దేవుళ్ల చిత్ర పటాల కింద ఉన్న 5 చెక్క పెట్టెల్లో.. ఏకంగా 122 కిలోల గంజాయిని నిందితులు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ. 5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు నిందితులతోపాటు ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ. 30 వేలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ జిల్లా నుంచి తమిళనాడుకు గత కొద్దిరోజులుగా ఇదే విధంగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు తమిళనాడుకు చెందిన సెల్వం, రౌతుల పూడి మండలం శ్రుంగ వరం గ్రామానికి చెందిన గాది వెంకట రమణగా గుర్తించారు. గంజాయి తరలించే వారు ఎవరైనా కఠినంగా శిక్షించి తీరుతామని డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ హెచ్చరించారు.

మరో ఘటనలో..
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లెనిన్ నగర్ లో గంజాయి కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. దాడిచేసి నిందితుల నుంచి రెండున్నర కేజీల గంజాయి(cannabis) స్వాధీనం చేసుకున్నారు. విచారణలో.. విశాఖ ఏజెన్సీలోని మల్లుదొర అనే వ్యక్తి గంజాయి అందజేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ గంజాయి విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని ఎస్సై సమీర్ బాష తెలిపారు. నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తామని పట్టణ సీఐ ప్రభాకర్ రావు తెలిపారు.

ఇదీ చదవండి:

oxygen plants: రాష్ట్రంలో ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించిన మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.