అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంటూరులో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. నెలరోజులుగా ప్రజలు, రైతులు ఉద్యమిస్తుంటే ప్రభుత్వం తమకేం పట్టనట్లు వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు ముందుకు సాగడం మంచిది కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలన్నారు. ప్రజా బ్యాలెట్లో పెద్దఎత్తున ప్రజలు పాల్గొంటున్నారని.. ఇంతకంటే ప్రజల ఆకాంక్ష ప్రభుత్వానికి ఇంకెలా తెలిపాలన్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: