pawan kalyan visit Sri Vasavi Kanyaka Parameshwari temple: గుంటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి శతవసంతాల వేడుకలు కన్నుల పండుగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో పవన్‌కు స్వాగతం పలికారు. అర్చకుల వేదమంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి పూజలు నిర్వహించారు. సుమారు 15 నిమిషాలపాటు ఆలయంలోనే గడిపారు. అనంతరం దేవాలయం బయట అభిమానులకు పవన్ అభివాదం తెలిపారు. పవన్ రాకతో దేవాలయం వద్ద భక్తులు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండి: