ETV Bharat / city

ఆపరేషన్ ముస్కాన్: తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు

ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్ - 19... బాలకార్మికులు, అనాథ బాలలకు ఆశ్రయాన్ని కల్పిస్తోంది. పట్టించుకునేవాళ్లు లేక, ఆకలితో రోడ్ల పక్కన... ఎవరైనా ఇంత పెట్టకపోతారా అని ఆర్థ్ర చూపులతో వేచిచూచే వారికి గుంటూరు పోలీసులు అండగా నిలిచారు. ఆపరేషన్ ముస్కాన్​లో వారిని గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ఎవరూ లేనివారిని వసతి గృహాలకు తరలిస్తున్నారు.

ఆపరేషన్ ముస్కాన్ : తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు

author img

By

Published : Jul 17, 2020, 1:43 PM IST

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాలతో ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్ -19లో భాగంగా గుంటూరు అర్బన్ లాలాపేట పోలీసు స్టేషన్ పరిధిలో 8 మంది అనాథ బాలలను గుర్తించారు. అలాగే.. పాత గుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలో 11 మంది బాలురు, ఇద్దరు బాలికలు, అరండల్ పేటలో ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు, నగరంపాలెంలో ఏడుగురు, పట్టాభిపురంలో నలుగురిని గుర్తించారు. మంగళగిరిలో 14 మంది, చేబ్రోలులో 9 మంది, నల్లపాడులో నలుగురు, మేడికొండూరులో 17 మంది, ప్రత్తిపాడులో 8 మంది, వట్టిచెరుకూరులో ఇద్దరు బాలురు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 92 మంది బాలబాలికలను గుర్తించారు. వారందరినీ గుంటూరు సీడబ్ల్యూసీ ఛైర్ పర్సన సుగుణాల రాణి ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చారు. విచారణ అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించాలని ఆమె ఉత్తర్వులు ఇచ్చారు.

కఠిన చర్యలు

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు బాధ్యత వహించి, బాలబాలికల హక్కులు కాపాడేందుకు కృషి చేయాలని ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. చిన్న పిల్లలను పరిశ్రమల్లో, తయారీ సంస్థల్లో, మెకానిక్ షెడ్ లలో కూలిపనులు చేయించరాదని హెచ్చరించారు. చిన్నపిల్లలు విద్యాలయాల్లోనే ఉండాలి గాని, కూలి పనుల్లో కాదన్నారు. చట్టాలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన చిన్నపిల్లలను పనుల్లో పెట్టుకున్న వారిపై సీడబ్ల్యుసీ అధికారుల ఆదేశాల మేరకు కేసులు నమోదుచేస్తామన్నారు.

ఇదీ చదవండి : మద్యానికి బానిసైన కుమారుడు.. హతమార్చిన కన్నతల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.