ETV Bharat / city

గుంటూరు ఛానెల్‌ నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ఆందోళన

Guntur Channel Water Pollution: గుంటూరు నగరం సహా జిల్లాలోని చాలా గ్రామాలకు తాగు, సాగునీరు అందించే అతి ప్రధానమైన కాలువ. అంత ముఖ్యమైన కాలువ.. అధికారుల నిర్లక్ష్యంతో కాలుష్యం బారిన పడింది. వివిధ మార్గాల్లో మురుగునీరు కలుస్తున్నా.. గుర్రపుడెక్క పేరుకుపోయినా పట్టించుకునే వారే లేరు. పైగా ఎలాంటి శుద్ధి చేయకుండానే నీటిని గ్రామాలకు సరఫరా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

Contamination of Guntur channel
గుంటూరు ఛానెల్‌ కలుషితం
author img

By

Published : May 18, 2022, 5:56 AM IST

గుంటూరు ఛానెల్‌ నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం

Guntur Channel: ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు జిల్లాకు నీటిని తీసుకెళ్లే ప్రధాన కాలువ గుంటూరు ఛానెల్‌. 47 కిలోమీటర్ల పొడవున సాగే ఈ కాలువ ద్వారా గుంటూరు నగరంతోపాటు చుట్టుపక్కల 36 గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందుతుంది. ఎంతో కీలకమైన ఈ కాలువ కొన్నేళ్లుగా కాలుష్య కారకంగా మారింది. గుంటూరుతోపాటు ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని సహా వివిధ ప్రాంతాల నుంచి మురుగునీరు కలవడం వల్ల గుంటూరు ఛానెల్ కలుషితమవుతోంది. అలాంటి నీటిని శుద్ధి చేయకుండా చెరువుల్లో నింపి, గ్రామాలకు సరఫరా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

మురుగునీరు కాలువ దాటి వెళ్లేందుకు దశాబ్దాల క్రితమే గుంటూరు ఛానెల్‌పై చప్టాలు నిర్మించారు. ఇవి పగిలిపోయి మురుగునీరంతా కాలువల్లో కలుస్తోంది. మంగళగిరి, తక్కెళ్లపాడు వద్ద కాంక్రీట్ నిర్మాణాలు పగిలిపోయి... అక్కడి నుంచి మురుగునీరు గుంటూరు ఛానల్లోకి వెళ్తోంది. ముఖ్యంగా అనంతవరప్పాడు, లేమల్లెపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేసే క్రమంలో ఫిల్టర్ పాయింట్ల ద్వారా శుద్ధి చేసినా... రసాయన అవశేషాలు మాత్రం వేరుపడటం లేదు. ఈ నీరు తాగాలంటే భయపడుతున్న జనం.... వాటర్ ప్లాంట్ల నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు.

గుంటూరు ఛానెల్‌లో మురుగునీరు కలుస్తున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కాలువలపై ఉన్న చప్టాలకు మరమ్మతులు చేయడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా తాగునీటి కాలువలో మురుగునీరు కలవకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం.. ముగ్గురు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.