ETV Bharat / city

అనుమానాస్పద స్థితిలో శివశ్రీ సోదరుడు మృతి - క్రైమ్ వార్తలు.

mysterious
mysterious
author img

By

Published : Aug 24, 2021, 10:36 PM IST

Updated : Aug 25, 2021, 10:07 AM IST

22:34 August 24

MYSTERIOUS DEATH

గుంటూరు జిల్లా తాడేపల్లి అమరారెడ్డి నగర్‌లో ఇళ్ల కూల్చివేతను ప్రశ్నించిన శివశ్రీ.. సోదరుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. అనిల్‌కుమార్‌.. మంగళవారం రాత్రి పెదకాకాని మండలం తక్కెళ్లపాడు వద్ద విగతజీవిగా పడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన మంగళవారం ఉదయం తన సోదురుడు ప్రతాప్‌కు ఫోన్‌ చేశారు. ఇల్లూ, వాకిలి లేకపోవడంతో తన భార్యాపిల్లలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రతాప్‌ తెలిపారు. 

ప్రకాశం జిల్లా దర్శిలో తన స్నేహితుడు వెంకటేశ్వరరావుతో ఉన్నట్లు చెప్పాడన్నారు. రాత్రి 8 గంటల కల్లా.. అనిల్‌కుమార్‌ను ఇంటికి తీసుకొస్తానని వెంకటేశ్వరరావు తనతో చెప్పాడని.. ప్రతాప్‌ తెలిపారు. రాత్రి ఎనిమిదిన్నర సమయంలో అనిల్‌ మృతదేహాన్ని వెంకటేశ్వరరావు ఆటోలో తీసుకొచ్చారు. తక్కెళ్లపాడు సమీపంలోని ఓ మద్యం దుకాణం వద్ద మృతదేహం పడి ఉండటంతో తీసుకొచ్చానని.. అనిల్‌ కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై శివశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్నుంచీ తమకు ప్రాణాహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో కుట్ర ఉందని.. విచారణ చేసి అసలు విషయాలు వెలికితీయాలని కోరారు

ఇదీ చదవండి: 

ASSEMBLY SESSIONS: సెప్టెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు

Last Updated : Aug 25, 2021, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.