పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని.. కార్మికులు పుష్ కాట్ సంచి తగిలించుకొని ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించుకుంటే విధుల నుంచి తొలగిస్తామని గూంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ హెచ్చరించారు. రోజువారీ పర్యటనలో భాగంగా శ్రీనగర్, మల్లిఖార్జున పేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుద్ధ్యంపై స్థానికులతో మాట్లాడారు.
ఆయా సచివాలయాల పరిధిలో ప్రధాన వీధుల్లో ప్రజలకు కనబడేలా ఎన్విరాన్మెంట్, ఎమినిటీస్, ప్లానింగ్, అడ్మిన్ సెక్రటరీ, నోడల్ ఆఫీసర్స్ ఫోన్ నెంబర్లతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరించే సమయంలో ప్లాస్టిక్ వస్తువులు పోగు చేసుకోవడం గమనించి సదరు కార్మికులను తక్షణం విధుల నుంచి నిలిపివేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: