రాష్ట్రవ్యాప్తంగా మార్చి 10న నగరపాలక, పురపాలక సంస్థలకు జరిగే పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లందరికీ ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని పురపాలకశాఖ ఎన్నికల విభాగం అధికారులు కమిషనర్లందరికి ఆదేశాలు చేశారు. ఓటరు సులభంగా తాను ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రాన్ని, ఓటరు జాబితాలోని క్రమసంఖ్యను తెలుసుకునేందుకు వీలుగా వీటిని అందించనున్నారు. ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పుల ముద్రణ, పంపిణీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. ముందుగా స్లిప్పులు అందని వారికి పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌వోలు, సిబ్బంది అందించనున్నారు.
ఇదీ చదవండి: నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ