11 ఏళ్ల తర్వాత గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్నాయని గల్లా జయదేవ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు. తెదేపా హయాంలోనే నగరానికి రక్షితనీటి పథకం, భూగర్భ డ్రైనేజీ పథకం తెచ్చామని జయదేవ్ గుర్తు చేశారు. తెదేపా హయాంలో 50 శాతం యూజీడీ పనులు పూర్తి చేయగా.. వైకాపా ప్రభుత్వం వచ్చాక కొంచెం కూడా పనులు ముందుకు సాగలేదని జయదేవ్ ఆరోపించారు.
ఇదీ చదవండి: గుజరాత్లో ప్రశాంతంగా పోలింగ్