ETV Bharat / city

Minister Vellampalli on CBN: చంద్రబాబు గ్రాఫిక్స్​తో పాలన చేశాడు : మంత్రి వెల్లంపల్లి - Vellampalli fired on CBN

Minister Vellampalli on TDP: కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దుయ్యబట్టారు. చంద్రబాబు అమరావతి అని చెప్పి భ్రమరావతిని సృష్టించి గ్రాఫిక్స్​తో పరిపాలన చేశాడని విమర్శించారు.

Minister Vellampalli on CBN
చంద్రబాబుది గ్రాఫిక్స్ పాలన...-మంత్రి వెల్లంపల్లి
author img

By

Published : Mar 6, 2022, 1:08 PM IST

చంద్రబాబుది గ్రాఫిక్స్ పాలన...-మంత్రి వెల్లంపల్లి

Minister Vellampalli on CBN: గుంటూరు సత్తెనపల్లిలో రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు క్లాక్ టవర్​ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో విజయవాడలో దేవాలయాలను కూల్చారని ఆరోపించారు. భాజపా, తెదేపా, జనసేన పార్టీలు కలసి దేవాలయాలను, గోశాలను కూల్చి దుర్మార్గపు పరిపాలన చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

చంద్రబాబు అమరావతి అని చెప్పి భ్రమరావతిని సృష్టించి గ్రాఫిక్స్​తో పరిపాలన చేశారని విమర్శించారు. అమరావతి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ భ్రమలో ఉంచిన వ్యక్తి చంద్రబాబు అని అరోపించారు. చంద్రబాబు నాలుగు బిల్డింగులు కట్టి రాజధాని అంటున్నాడన్నారు. తాత్కాలిక బిల్డింగులు కట్టి తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేసి వెళ్లిపోయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

విజయవాడ దుర్గ గుడిని రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. ప్రజల్లో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. విద్యాలయాలు, వైద్యశాలలను అభివృద్ధి చేసింది తమ ప్రభుత్వం కాదా అని వెల్లంపల్లి ప్రశ్నించారు.

ఇదీ చదవండి :

TDP Pattabhi fired on Sajjala: 'సజ్జలకేం తెలుసు.. భూములు కోల్పోయిన రైతుల బాధ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.