ETV Bharat / city

ఆకలి చూపులు...వలస కూలీల అవస్థలు - ఏపీ లాక్​డౌన్ ఎఫెక్ట్

రెక్కాడితే తప్ప డొక్కాడని బతుకులు వారివి. కడుపు నిండాలంటే ఏ పూటకు ఆపూట చెమటోడ్చాల్సిందే.. కష్టపడేందుకు ఎన్నడూ వెన్ను చూపరు. కానీ లాక్‌డౌన్‌ వారి జీవనాన్ని అయోమయం చేసింది. పనుల్లేక, పొట్ట నింపుకునే దారిలేక, రోజు కూలీలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం.

Migrant labour faced severe problem due to lock down in guntur
ఆకలి చూపులు...వలస కూలీల అవస్థలు
author img

By

Published : Apr 24, 2020, 5:54 AM IST

ఆకలి చూపులు...వలస కూలీల అవస్థలు

'ఒక్క పూట అన్నం కోసం ఎదురుచూడటం అంటూ.....ఆ మధ్య వచ్చిన ఓ సినిమా పాట ఇప్పుడు లాక్‌డౌన్‌ చట్రంలో చిక్కుకున్న రోజువారీ కూలీల కష్టాలకు అద్దంపడుతోంది. గుంటూరు శివార్లలోని సుశాంక గోయల్‌, కృష్ణబాబు, గంగిరెద్దుల కాలనీల్లో.. ఎక్కువగా కూలిచేసుకునే పేదలే నివసిస్తుంటారు. వీరికి సాధారణ రోజుల్లోనే ఒక్కోసారి ఉపాధి దొరకదు. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా పనుల్లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఆదాయంలేక ఆహారం, నిత్యావసరాలిచ్చే దాతల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయం, నిత్యావసరాలు అందరికీ అందట్లేదని... ఆయా కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తమ ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : ఇక ప్రభుత్వ భవనాలకు ఆ రంగులే...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.