సీఎంఏలో జాతీయస్థాయిలో తొలి ర్యాంకును సాధించిన గురు భాస్కర్‌రెడ్డిని మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ గుంటూరులో ఘనంగా సన్మానించారు. గురు భాస్కర్‌రెడ్డి విజయం ఎందరో విద్యార్థులకు స్పూర్తినిస్తుందని మోహన్ చెప్పారు. తమ తల్లిదండ్రులు తన కోసం పడుతున్న కష్టాన్ని చూసి వారి కన్నీళ్లు తుడవాలనే లక్ష్యంతో పట్టుదలతో ర్యాంకు సాధించినట్లు భాస్కర్‌రెడ్డి చెప్పారు. తమ ఏకాగ్రత స్థాయిని బట్టి ఎన్ని గంటలు చదవాలో విద్యార్థులే నిర్ణయించుకోవాలని గురు భాస్కర్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి...'విద్యాదీవెన'కార్డులో హీరో మహేష్‌బాబు చిత్రం