ETV Bharat / city

బతుకు కూలింది.. ఇంటి బాట పట్టింది - వలస కూలీల అవస్థలు

పొట్టకూటి కోసం కన్నవాళ్లు, బంధువులు, స్నేహితులను వదిలి వందల కిలోమీటర్ల దూరంలోని గుంటూరు జిల్లాకు కూలీ పనుల నిమిత్తం వలస వచ్చారు. మిర్చి కోతలు పూర్తవుతున్న సమయంలో సొంతూళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈనెల 14న లాక్‌డౌన్‌ సడలింపు ఇస్తే స్వస్థలాలకు వెళ్లాలని ఎదురుచూస్తూ వచ్చారు. మళ్లీ 19రోజులు లాక్‌డౌన్‌ పొడిగించడంతో ఏంచేయాలో పాలుపోక కూలీలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.

kurnool migrant labours stopped guntur police
బతుకు కూలింది ..బాట పట్టింది
author img

By

Published : Apr 19, 2020, 3:06 PM IST

గ్రామాల్లో ముసలి తల్లిదండ్రులు, చిన్నపిల్లలను వదిలి వచ్చిన కూలీలు అక్కడ వారు ఎలా ఉన్నారో... తినడానికి తిండి ఉందో... లేదో... వసతిగృహాల నుంచి వచ్చిన పిల్లలకు వండిపెట్టేదెవరు? వంటి ఆలోచనలతో ఆవేదన చెందుతున్నారు. ఇక్కడేమో పనులు లేక సరైన వసతి లేక పెరిగిన ఎండలకు అల్లాడిపోతున్నారు. ఇన్నాళ్లుగా అష్టకష్టాలు పడి సంపాదించిన అరకొర సొమ్ము ఇక్కడే ఖర్చు చేస్తే ఎలా? అన్న ఆందోళన వారిని వెంటాడుతూనే ఉంది. తమను సొంతూళ్లకు పంపించాలని అధికారులను కాళ్లావేళ్లాపడి వేడుకుంటున్నా నిబంధనలు అనుమతించవని అంగీకరించడం లేదు.

ఈ కారణంగా.. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు కూలీలు ప్రకాశం జిల్లా నుంచి కాలినడకన బయలుదేరి వెళుతున్నారు. వీరిని చిలకలూరిపేట సమీపంలో ‘ఈనాడు’ గుర్తించి వందల కిలోమీటర్లు చంటిబిడ్డలను ఎత్తుకుని ఎలా వెళతారని ప్రశ్నిస్తే.... అక్కడ ఉన్న తమ పిల్లలు, వృద్ధులకు ఆహారం లేదని, తాము వెళ్లక తప్పని పరిస్థితుల్లో బయలుదేరామని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారులు మానవత్వంతో స్పందించి వాహన సదుపాయం ఏర్పాటు చేసి తమను స్వగ్రామాలకు పంపాలంటూ వేడుకున్నారు.

కర్నూలు జిల్లా అటేకల్‌ గ్రామానికి చెందిన నరసింహులు, రామాంజినమ్మ దంపతులకు నలుగురు పిల్లలు. నాలుగేళ్ల వయసున్న పిల్లవాడిని వెంటబెట్టుకుని జనవరిలో ప్రత్తిపాడు మండలంలో మిర్చి కోతలకు వచ్చారు. 11, 7, 5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు సొంతూళ్లులో నాయనమ్మ వద్ద ఉంటున్నారు. నాయనమ్మ వద్ద ఉండలేక పిల్లలు ఏడుస్తున్నారని తమను సొంతూరికి పంపే ఏర్పాటుచేయాలని నరసింహులు, రామాంజినమ్మ పోలీసులను వేడుకుంటున్నారు.

పిల్లల ఆకలి తీర్చాలని....

కర్నూలు జిల్లా సి బెళగల్‌ మండలానికి చెందిన తిమ్మయ్య, మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు. 9ఏళ్ల కూతురిని వెంటబెట్టుకుని జనవరి 20న ప్రత్తిపాడుకు మిర్చి కోతలకు వచ్చారు. మిగిలిన ఇద్దరు 10, 11 ఏళ్ల పిల్లలు గ్రామానికి సమీపంలోని వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. వసతిగృహానికి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చి వాళ్ల నాయనమ్మ వద్ద ఉంటున్నారు. ఆమెకు ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో పిల్లలకు వండిపెట్టడం కూడా ఇబ్బందిగా ఉండటంతో పిల్లలు ఏడుస్తున్నారని తమను స్వస్థలానికి పంపాలని అధికారులను తిమ్మయ్య దంపతులు అభ్యర్థిస్తున్నారు.

పురుడుకు పుట్టింటికి పంపించాలని....

కర్నూలు జిల్లా సి.బెంగాల్‌ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన రాంపోగు బాబు-సుమిత్ర దంపతులు వారి రెండేళ్ల చిన్నారిని వెంటపెట్టుకొని మిర్చికోతలకు పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామానికి మూడు నెలల కిందట వచ్చారు. సుమిత్ర గర్భిణీ కావడంతో కావటంతో పనులకు వెళ్లకుండా రైతు ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారంలో తలదాచుకుంటూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. ప్రసవం సమయానికి తమ స్వగ్రామానికి వెళదామనుకున్న ఆమెకు లాక్‌డౌన్‌ అడ్డంకిగా మారింది. ఎండ వేడిమి తట్టుకోలేక పట్టా కింద ఉండలేక ఆమె పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రసవానికి పుట్టింటికి పంపాలని అధికారులను వేడుకుంటోంది. ఇలా పదుల సంఖ్యలో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు.

కష్టాన్ని నమ్ముకుని వస్తే....

సొంతూళ్లో ఉపాధి లేక వందల కిలోమీటర్ల దూరం దాటి కూలీ కోసం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వేలమంది గుంటూరు జిల్లాకు మిర్చికోతలకు సీజన్‌లో ఏటా వస్తారు. జనవరిలో వచ్చి మార్చి నెలాఖరు వరకు మిర్చికోతల పనులు చేసి కూలీ సొమ్ము తీసుకుని తిరిగి సొంతూళ్లకు వెళతారు. ఉగాది పండుగ నాటికి అందరూ ఇళ్లకు చేరుకునేవారు. ఈసారి ఇందుకు భిన్నంగా లాక్‌డౌన్‌తో ఇక్కడే నిలిచిపోయారు.

ఇదీ చదవండి:

పెట్రోల్​లో శానిటైజర్​ కలుపుకొని తాగి యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.