దృశ్యాలే ఆధారం
గుంటూరు జిల్లా ఇనిమెట్లలో పోలింగ్ రోజు సభాపతి కోడెల శివప్రసాదరావుపై దాడి కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆ రోజు వివిధ మార్గాల్లో రికార్డైన దృశ్యాలతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వైకాపా నేతలను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు పహారా
పోలీసుల అరెస్టులతో ఇంకా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. భారీగా బలగాలను సమస్యాత్మక ప్రాంతంలో మోహరించారు.
పర్యవేక్షణకు వస్తే కొట్టారు
ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న సమయంలో కొందరు వైకాపా కార్యకర్తలు కోడెలపై దాడి చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన స్పృహతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే.
ఇవీ చూడండి.