గుంటూరులో జరిగిన భాజపా ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలంతా ఇవాళ ఉపవాసంలో పాల్గొంటున్నారని చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న వైకాపా నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ప్రజలకు పంచుతూ వైకాపాకు ఓట్లు వేయాలని అడుగుతారా అని ఆగ్రహించారు. ఈ సమయంలో ప్రజలను ఆదుకోవాలిగానీ రాజకీయాలు వద్దని అధికార పార్టీ నాయకులకు హితవు పలికారు.
ఇదీ చదవండి: