ETV Bharat / city

మహనీయుడి స్మృతివనంలో మద్యం సేవించటమా ?- నాదెండ్ల - సత్తెనపల్లిలో వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతివనం వార్తలు

వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతివనంలో వైకాపాకు చెందిన కొందరు కార్యకర్తలు మద్యం సేవించటం అత్యంత బాధాకరమైన విషయమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ ఘటనపై అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. వెంటనే బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

JSP
JSP
author img

By

Published : Dec 11, 2020, 8:37 PM IST

గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతివనంలో వైకాపాకు చెందిన కొందరు కార్యకర్తలు మద్యం సేవించటం దారుణమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రా గాంధీగా పేరొందిన వావిలాల గోపాలకృష్ణయ్య ఔన్నత్యం... అధికార పార్టీ నేతలకు తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఇలాంటి చర్యలు సత్తెనపల్లి ప్రజలు, గాంధేయవాదులకు క్షోభ కలిగించేలా ఉందన్నారు. ఈ ఘటనపై స్థానిక మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. హోం మంత్రి కూడా ఇదే జిల్లాకు చెందినవారైనా ఇంతవరకు స్పందించకపోవటం బాధాకరమని అన్నారు.

ఇదీ చదవండి

మరో 4 రోజుల్లో వింత వ్యాధి నిర్ధరణ: వైద్యారోగ్యశాఖ కమిషనర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.