ETV Bharat / city

సౌరవిద్యుత్.. అటు పర్యావరణహితం.. ఇటు లాభదాయకం - గుంటూరులో శీతల గోదాములపై సౌరఫలకాలపై కథనం

లక్షల్లో వస్తున్న విద్యుత్ బిల్లులు, పెరిగిపోతున్న నిర్వహణ వ్యయంతో ఇబ్బందులు పడుతున్న శీతల గోదాముల యజమానులకు ఉపశమనం కలిగించేలా ఉద్యానశాఖ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. శీతల గోదాముల పైకప్పుపై సౌరవిద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేస్తే రాయితీలు అందజేస్తోంది. గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సౌరవిద్యుత్ ప్లాంట్లు మంచి ఫలితాలనిస్తున్నాయి. సౌరశక్తిని వృథాగా వదిలేస్తే ఉపయోగం లేదు. దానిని సద్వినియోగం చేసుకుంటే చోదకశక్తిలా పనిచేస్తుందని అధికారులు, నిపుణులు చెబుతున్నారు.

Installation of solar panels on cold storages in guntur
శీతల గోదాములపై సౌర ఫలకాలు
author img

By

Published : Oct 10, 2020, 2:38 PM IST

మిర్చి ఎక్కువగా సాగయ్యే గుంటూరు జిల్లాలో... పంట నిల్వ కోసం శీతల గోదాములు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు జిల్లా మొత్తం కలిపి 120కి పైగా గోదాములు ఏర్పాటయ్యాయి. గోదాముల సామర్థ్యం మేరకు రోజుకు 800 నుంచి 1000 యూనిట్ల వరకు కరెంటు వినియోగిస్తుంటారు. ఒక్కో యూనిట్​కు రూ.6.50 చొప్పున విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం ఒక గోదాము యజమాని నెలకు లక్ష నుంచి రూ. 4 లక్షల రూపాయల మేర కరెంటు బిల్లుల కోసం ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా సౌర ఫలకాలు అమర్చుకుంటే బిల్లుల నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. శీతలగోదాముపై ఉన్న స్థలంలో 150 కిలోవాట్లకు పైగా సౌరపలకలు ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.

సౌర ఫలకాలతో నెలకు 15వేల యూనిట్లు

జిల్లాలో ఇప్పటికే 3 శీతల గోదాముల యజమానులు ముందుకొచ్చి సౌర పలకలు ఏర్పాటు చేసుకోగా మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఒక శీతలగోదాముపై 120 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు చేయవచ్చు. తద్వారా రోజుకు 500 యూనిట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. అంటే నెలకు 15వేల యూనిట్లు వస్తుంది. నెలవారీగా వచ్చే విద్యుత్ బిల్లులో ఆ మేరకు వినియోగం తగ్గించి... మిగతా బిల్లు చెల్లిస్తే సరి. తమ శీతల గోదాముపై ప్లాంటు ఏర్పాటు చేయగా.... నెలకు రూ.90వేల వరకు బిల్లులో ఆదా అయినట్లు దాని యజమాని తెలిపారు. యూనిట్‌ ఏర్పాటుకు రూ.48లక్షలు ఖర్చయింది. బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. ఇప్పుడు విద్యుత్తు బిల్లు రూపంలో మిగులుతున్న సొమ్మును నెలవారీగా బ్యాంక్‌ వాయిదాలు చెల్లించడానికి ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఐదేళ్ల తర్వాత రుణం తీరిపోతుందని.. అప్పటినుంచి 20 ఏళ్ల పాటు విద్యుత్తు బిల్లుల రూపంలో సొమ్ము ఆదా కానుందని తెలిపారు. శీతలగోదాములో సరకు లేని సమయంలో ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను అమ్ముకునే వెసులుబాటు ఉంది. ఇది కూడా గోదాముల యజమానులకు కలిసొచ్చే అంశం.

రాయితీ ఇస్తున్న ఉద్యానశాఖ

సౌర పలకలు అమర్చే శీతల గోదాములకు ఉద్యానశాఖ రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. గోదాముల్లో సరకుని భద్రంగా ఉంచేలా నియంత్రిత వాతావరణం కోసం శీతల యంత్రాలను నిరంతరం వినియోగించాల్సి ఉంటుంది. అందుకే విద్యుత్ బిల్లులను తగ్గించుకునేందుకు సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు మంచి అవకాశమని అధికారులు సూచిస్తున్నారు. గోదాముల యజమానులు సవివర ప్రాజెక్టు నివేదికతో దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తామంటున్నారు. ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీ నుంచి సౌరపలకలు అమర్చుకున్న తర్వాత యూనిట్లను తనిఖీ చేసి రాయితీ సొమ్ము విడుదల చేస్తారు. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా రాయితీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. యూనిట్‌ వ్యయంలో 35 శాతం మేర రాయితీ రూపంలో ఇవ్వనున్నారు. ఒక వేళ ప్లాంటు సామర్థ్యం ఎక్కువగా ఉంటే... గరిష్ఠంగా రూ.12లక్షల మేర రాయితీ కింద అందిస్తామని వివరించారు. అయితే ప్లాంటు ఏర్పాటుకు పెట్టుబడి ఎక్కువగా ఉన్నందున రాయితీ మరింత పెంచాలని శీతలగోదాముల యజమానుల సంఘం కోరుతోంది.

ఒక యూనిట్‌ కరెంట్ ఆదా చేయటం 2 యూనిట్ల ఉత్పత్తికి సమానమంటారు విద్యుత్ రంగ నిపుణులు. అందుకే సంప్రదాయ విధానంలో బొగ్గు, నీటి ద్వారా విద్యుత్ తయారీ కంటే ఇలా సౌరశక్తి ద్వారా కరెంటు తయారీ మేలైనది, చౌకైనది. పైగా పర్యావరణహితమైనది. అందుకే శీతల గోదాములతో పాటు ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్ ప్లాంట్లకు సంబంధించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు అధికారులు.

ఇవీ చదవండి..

మన్ను తింటున్న గోవులు.. ఎక్కడో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.