ETV Bharat / city

3 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట: హోంమంత్రి సుచరిత - ash payments to Agrigold‌ victims

పదివేలు నుంచి 20 వేల రూపాయలలోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు మంగళవారం నగదు చెల్లింపులు చేపట్టినట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. దీంతో దాదాపు 3 లక్షల మందికి ఊరట కలుగుతుందన్నారు. రూ. 20 వేలకుపైగా డిపాజిట్లు చేసినవారికి త్వరలో న్యాయం చేస్తామన్నారు.

home minister sucharitha
హోం మంత్రి మేకతోటి సుచరిత
author img

By

Published : Aug 23, 2021, 8:28 PM IST

అగ్రిగోల్డ్ కుంభకోణం చంద్రబాబు హయాంలో జరిగితే బాధితులకు వైకాపా ప్రభుత్వం న్యాయం చేస్తోందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్..​ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటున్నారని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. పదివేలలోపు డిపాజిట్లు చేసిన వాళ్లకు మొదటి విడతగా రూ. 269 కోట్లు చెల్లించారని గుర్తుచేశారు. రూ. 10 నుంచి రూ. 20 వేలలోపు డిపాజిట్లు చేసిన వారి ఖాతాల్లో మంగళవారం సీఎం జగన్​ జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో మూడు లక్షల మందికిపైగా అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కలుగుతుందన్నారు. రూ. 20 వేలకుపైగా డిపాజిట్లు చేసిన వారికి త్వరలో న్యాయం చేస్తామని చెప్పారు.

కనీసం సెబీ అనుమతి లేకుండానే అగ్రిగోల్డ్ సంస్థ రూ. 6వేల 500కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో అగ్రి గోల్డ్ బాధితులను పట్టించుకోకపోగా హాయ్​లాండ్​ను అగ్రిగోల్డ్ ఆస్తి కాదని చెప్పించారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద పెట్టుబడులు పెట్టే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

శీలానికి వెలకట్టలేదు: సుచరిత
గుంటూరులో విద్యార్థిని రమ్య హత్యకేసులో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి సాయం చేసిందే తప్ప... శీలానికి వెలకట్టలేదని హోంశాఖ మంత్రి సుచరిత అన్నారు. ఈ కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేశామని... ఈ క్రమంలో రమ్య కుటుంబానికిి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఓ వైపు దిశ చట్టం లేదని చెబుతున్న లోకేశ్​.. నిందితుడిని శిక్షించడానికి 21 రోజుల డెడ్ లైన్ ఎలా పెడతారని ఆమె ప్రశ్నించారు. శిక్ష విధించే అధికారం కోర్టు పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. మైనర్‌పై కానిస్టేబుల్‌ అత్యాచారానికి పాల్పడినట్లు లోకేశ్‌ అబద్ధపు ప్రచారం చేయటం తగదన్నారు.

ఇదీ చదవండి..

tirumala: రేపు తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.