పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై దాడి ఘటనకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ప్రతివాదిగా చేర్చేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. 2018 మే నెలలో పాత గుంటూరు పీఎస్‌పై దాడి కేసులో కొందరు యువకులపై నమోదైన 6 ఎఫ్ఐఆర్లపై ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది ఆగస్టు 12న జీవో 776 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ గణేశ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 26కు హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. ఈ కేసులో ఎన్ఐఏను ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ గత విచారణలో పిటీషనర్.. ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ చట్టంలోని షెడ్యూల్ నేరాల కిందకు రావని ఎన్ఐఏ తరపు న్యాయవాది గత విచారణలో పేర్కొన్నారు. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయరా? అని ధర్మాసనం ఆ సందర్భంలో వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి:
ఫోన్ చూస్తే తండ్రి తిడుతున్నాడని కుమారుడి కిడ్నాప్ డ్రామా...