ETV Bharat / city

ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు...వినియోగదారులకు తప్పని కన్నీళ్లు

రాష్ట్రంలో ఉల్లి ధరలు భగ్గమంటున్నాయి. రోజు రోజుకూ ధరలు పెరుగుతూ సామాన్యులచే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భారీ వర్షాలు ఉల్లి పంటలపై తీవ్ర ప్రభావం చూపటంతో..కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. గుంటూరు మార్కెట్​లో గత వారం రూ. 50 ఉన్న కిలో ఉల్లి... ఇప్పుడు రూ. 75 నుంచి 80 పలుకుతోంది. ధరలు ఇలాగే పెరిగితే ఉల్లిని కొనేదెలా ? తినేదెలా ? అని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు
author img

By

Published : Oct 19, 2020, 10:42 PM IST

సాధారణంగా కిలో 20 లోపు ఉండే ఉల్లి ధర గుంటూరు మార్కెట్​లో ఇప్పుడు రూ. 75 నుంచి 80 కి చేరుకుంది. ఉల్లి ఉత్పత్తికి ప్రధానమైన మహారాష్ట్ర మార్కెట్​లో టోకున కిలో 60 నుంచి 100 రూపాయల ధర పలుకుతోంది. అక్కడి నుంచి రవాణా, తరుగు, కమీషన్, ఇతర ఖర్చులు కలిపి కిలోకు 10 వరకు ఖర్చవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇవి రిటైల్ మార్కెట్​లోకి వచ్చి విక్రయించే సరికి మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు.

భారీ వర్షాలే కారణం

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో వరదల వల్ల ఉల్లి పంట ముంపునకు గురైంది. గుంటూరు జిల్లాకు ఎక్కువగా మహారాష్ట్రలోని షోలాపూర్, పూనే, అహమ్మద్‌ నగర్, నాసిక్ తదితర మార్కెట్ల నుంచి ఉల్లి దిగుమతి అయ్యేవి. సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలల్లో కర్నూలుతో పాటు కర్ణాటక నుంచి ఉల్లి స్థానిక మార్కెట్​కు వస్తాయి. సగటున మూడు నెలలు మినహా...మిగిలిన కాలమంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి జిల్లాకు ఉల్లిపాయలు దిగుమతి అవుతాయి. కర్ణాటకలో ఈసారి వరదల వల్ల పంట పెద్దఎత్తున దెబ్బతింది. మహారాష్ట్రలో ప్రస్తుతం మార్కెట్​కు కొత్త పంట రావాల్సి ఉండగా...వర్షాలకు పాడైంది. దీంతో నిల్వ ఉన్న సరకుకు డిమాండ్ అమాంతం పెరిగింది. సరకు లభ్యత తగ్గిపోవడం.., వరదల తర్వాత ఒక్కసారిగా అన్ని ప్రాంతాల నుంచి ఉల్లిపాయలు కావాలని ఆర్డర్లు రావడంతో రోజుల వ్యవధిలోనే ధరలు పెరిగాయి.

కొత్త పంట మార్కెట్​లోకి వస్తేనే...

మహారాష్ట్ర మార్కెట్లలో పాత ఉల్లిపాయలు క్వింటాల్​ 6 వేల నుంచి 10 వేల వరకు ధర పలుకుతోంది. దీంతో ఇక్కడి స్థానిక వ్యాపారులు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. రోజుకు 50 బస్తాలు విక్రయించే టోకు వ్యాపారులు..20 బస్తాలకు మించి విక్రయించలేకపోతున్నారు. ధరలు అనూహ్యంగా పెరగడంతో బస్తా కొనే హోటళ్లు, క్యాటరింగ్ నిర్వహకులు పది కిలోలతో సరిపెడుతున్నారు. ఏదైనా వర్షాలు తగ్గి కొత్త పంట మార్కెట్​లోకి వస్తే కానీ పరిస్థితులు చక్కబడే అవకాశాలు కనపించడం లేదు. దీంతో వినియోగదారులకు మరి కొన్నాళ్లు ఉల్లి కన్నీళ్లు తప్పేలా లేవు.

ఇదీ చదవండి:

ఆడపిల్లగా పుట్టింది... మగరాయునిగా బతికింది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.