గుంటూరు జీజీఎచ్‌లో చికిత్స పొందుతున్న కౌలు రైతు సలీంను జనరల్ వార్డుకు మార్చినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం వేమూరు మండలం పోతుమర్రులో సలీం ఆత్మహత్యకు యత్నించాడు. పంటను అధికారులు బలవంతంగా కోసేందుకు యత్నించారని సలీం ఆరోపించాడు. వేమూరు ఎస్సై, ఎమ్మార్వో అవినీతిలో కూరుకుపోయారని ఆవేదన చెందాడు. సాగుచేసిన పంటను ఎమ్మెల్యే అండతో దోచుకోవడానికి యత్నిస్తున్నారని వాపోయాడు.
వేమూరు ఎమ్మార్వో, ఎస్సైపై చర్యలు తీసుకోవాలి సలీం డిమాండ్ చేస్తున్నాడు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన తర్వాత న్యాయపోరాటం చేస్తానని సలీం వివరించారు. ఈ సమస్య గురుంచి సీఎం జగన్ కు అనేక సార్లు లేక రాశానని చెప్పారు. క్రింది స్థాయి అధికారాలు దానిని సీఎం దృష్టికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని సీలీం అన్నారు. సీఎం జగన్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు.
ఇదీ చదవండి:
పొలం కబ్జాకు వైకాపా నేతల యత్నం...కత్తితో పొడుచుకున్న కౌలు రైతు!