గుంటూరు జిల్లా పొందుగల చెక్పోస్టును రూరల్ ఎస్పీ విజయారావు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కొందరు దొంగచాటుగా రాకపోకలు సాగిస్తున్నారని... వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వలస కూలీల విషయంపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. మద్యం దుకాణాల్లో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపడతామన్నారు.
![guntur rural sp visits pondugula check post](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/vlcsnap-2020-05-05-08h08m20s911_0505newsroom_1588646340_107.jpg)
ఇదీ చదవండి :